TEJA NEWS TV : కర్నూలు జిల్లాలో క్రిమిసంహారక మందుల షాపుల నిర్వహణ కోసం లైసెన్స్ ఆశించిన డీలర్లకు దేశి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ రమాకాంత్ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డీలర్లు రైతులను మోసం చేయరాదని తమ లాభాల కోసం అనవసరమైన రసాయన మందులు రైతులకు ఇవ్వడం వల్ల రైతు నష్టపోవడమే కాకుండా ఆహార పదార్థాలు విష తుల్యమవుతాయని అలా కాకుండా ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం పండించడం ఎలాగో వీలైతే రైతులకు తెలియజేయాలని వివరించారు. డీలర్లకు కర్నూలు జిల్లా కోసిగి మండలం లో ZBNF పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం లో జరిగే వ్యవసాయ పద్ధతులను రైతుల సమక్షంలోనే పొలంలో చూపించి వివరించారు. అర్లబండ గ్రామానికి చెందిన రైతు దుర్గయ్య పొలంలో ప్రకృతి పద్ధతిలో పండించిన మిరపను పరిశీలించి ద్రవ జీవమృతం తయారీ విధానాన్ని, వాడుక విధానాన్ని ఉపయోగాలను రైతు నుంచి తెలుసుకొని డీలర్లకు వివరించారు. కోసి మండలం కోల్మన్ పేట యూనిట్లో జరిగే ప్రకృతి వ్యవసాయ విధానాన్ని మెచ్చుకుంటూ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీలర్ షిప్ లైసెన్స్ ఆశించిన 40 మంది అభ్యర్థులు ప్రకృతి విధానంలో పండిన మిరప పంటను పరిశీలించి పంటకు అయిన పెట్టుబడిని, ప్రకృతి పద్ధతులు ద్వారా సాగు చేయడం వల్ల కలిగే లాభాలను రైతు దుర్గయ్య ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోలంపేట యూనిట్ APCNF ఇంచార్జ్ రాజం తోపాటు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
వ్యవసాయ ఉత్పత్తులపై డీలర్లకు అవగాహన సదస్సు
RELATED ARTICLES