భద్రాచలం TEJA NEWS TV
భద్రాచలం పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం కార్తీక వనసమారాధన మహోత్సవం ఆదివారం పట్టణ శివారు ప్రాంతమైన మేడువాయిలోని తోట నందు అధ్యక్షుడు అనుగోజు నరసింహాచారి అధ్యక్షతన వైభవంగా జరిగింది. ముందుగా మధ్విరాజ్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారికి పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో కులబాంధవులు అందరూ ఒక్కచోట కలసిన శుభసందర్భంలో ఆత్మీయ పలకరింపులు చేసుకున్నారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, ఆటల పోటీలు ఆకట్టుకున్నాయి. కాగా భద్రాచలం శాసనసభ్యుడు డా. తెల్లం వెంకట్రావు, భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్.రమాదేవి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వీరికి కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ముందుగా ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ … తల్లి గర్భం నుంచి బిడ్డను తీసేందుకు వాడే కత్తుల దగ్గర నుంచి మనిషి మరణించిన తరువాత సమాధికి తవ్వే గడ్డపారా, పారల వరకు, రైతన్న వ్యవసాయం చేసేందుకు వాడే నాగలి వంటివి తయారు చేసేవి విశ్వబ్రాహ్మణులేనని, సమాజంలో విశ్వబ్రాహ్మణుల పాత్ర ప్రధానమైనదని కొనియాడారు. విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి అనునిత్యం పాటుపడతానని అన్నారు. అనంతరం దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎల్.రమాదేవి మాట్లాడుతూ కులబాంధువులను అందరిని ఒక్కచోట కలుసుకోవడం, ఆత్మీయంగా పలకరించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడు కాపర్తి వెంకటాచారి, గౌరవ అధ్యక్షులు రామోజు రాముడు, అనుగోజు నాగభూషణం, కడియం రామాచారి, దేవాదుల రమణ, మొగడా హరినాధ్, గౌరవ సలహాసభ్యులు ముండూరి సత్యనారాయణ, మహాదేవ సత్యనారాయణ, పూసల కృష్ణమాచారి, అనసూరి చలపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి పెందోట సత్యనారాయణ, కోశాధికారి శ్రీరాముల త్రివిక్రమాచారి, కార్యనిర్వహణాధ్యక్షులు దార్ల బ్రహ్మానందాచార్య, ఉపాధ్యక్షులు చిట్టిమోజు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు చలపాక మధు, గుంటముక్కల భరత్ కుమార్,ఇల్లా సత్యనారాయణ, బొద్దోజు శ్రీను, పెదపాటి వరబాబు, పట్టణ బీఆర్ఎస్ కన్వీనర్ అకోజు సునీల్ కుమార్, ప్రముఖ కవి, తాతోలు దుర్గాచారి, స్వర్ణకార సంఘం, బులియన్ మర్చంట్ భద్రాచలం అధ్యక్షుడు ఇజ్జాడ ప్రభాకర్, దురిశెట్టి రామాచారి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా విశ్వబ్రాహ్మణ వనసమారాధన
-ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
-ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఎమ్మెల్యే డా. తెల్లం, భద్రాద్రి దేవస్థానం ఈవో రమాదేవి
RELATED ARTICLES