ఆళ్లగడ్డ పట్టణంలోని విశ్వరూప నగర్ లోని వేద న్యాచురల్ క్లినిక్ నందు గవ్య సిద్ధా స్పెషలిస్ట్ డాక్టర్ మైత్రేయి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఆవు పేడతో తయారుచేసిన గోమయ గణేష ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అహోబిలం ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ సుభద్రమ్మ , ఐఎంయూ ప్రెసిడెంట్ డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని పర్యావరణహితకరమైన గోమయంతో తయారుచేసిన గణేష్ ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవ్య సిద్ధ వైద్యురాలు మైత్రేయి మాట్లాడుతూ పర్యావరణహితకరమైన గోమయ గణేశులను గత రెండు సంవత్సరాలుగా భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలిపారు. డాక్టర్ సుభద్రమ్మ మాట్లాడుతూ గోవులో సమస్త దేవతలు నిక్షిప్తమై ఉన్నారని అలాంటి గోమయంతో తయారుచేసిన వినాయక ప్రతిమలను పూజించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ ప్రతిమలను వినాయక చవితి పండుగ సందర్భంగా అందజేసిన వైద్యురాలు మైత్రేయి ని డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి, డాక్టర్ సుభద్రమ్మ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో చాగలమర్రి కి చెందిన వేద పండితులు కైప ఆనంద్ శర్మ, సీనియర్ జర్నలిస్టు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
వేద నేచురల్స్ కేంద్రం ద్వారా గోమయ గణేశుల పంపిణీ
RELATED ARTICLES