నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామ సమీపంలోని డాక్టర్ నరసింహారెడ్డి గార్డెన్స్ లో సోమవారం చిన్నారి సారెడ్డి రక్షత్ రెడ్డి మొదటి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జన్మదిన వేడుకల కార్యక్రమంలో చిన్నారి అబ్బ, జేజిలు అయిన డాక్టర్ ఎస్. నరసింహారెడ్డి, డాక్టర్ శివనాగేశ్వరమ్మ దంపతులు మనవడు రక్షత్ రెడ్డిని నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని మనసారా ఆశీర్వదించారు. వేడుకలో హాజరైన అతిధులు అందరూ కూడా చిన్నారి రక్షత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి తండ్రి డాక్టర్ యశ్వంత్ రెడ్డి, తల్లి డాక్టర్ హనీష దంపతులు తమ కుమారుడితో కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి హాస్పిటల్ ఎండి డాక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ శివ నాగేశ్వరమ్మ, డాక్టర్ టీఎన్ లక్ష్మిరెడ్డి, డాక్టర్ చంద్రిక, ఎమ్మెస్ నారాయణ రెడ్డి, జయచంద్ర రెడ్డి, కళ తదితరులు పాల్గొన్నారు.
వేడుకగా రక్షిత్ రెడ్డి జన్మదిన వేడుకలు
RELATED ARTICLES