అమరుడా.. నీకు వందనం
వీర సైనికుడి త్యాగాన్ని దేశం మరిచిపోదు…
వీర జవాన్ మురళీ నాయక్ కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో బాగంగా నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహిస్తున్న తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందారు.ఆదివారం కౌతాళం వైయస్సార్ సర్కిల్ యందు జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి గారు పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి గారు మాట్లాడుతూ,సత్యసాయి జిల్లా వాసి సైనికుడు మురళీ నాయక్ దేశం కోసం వీరోచిత పోరాటంలో ప్రాణాలను సైతం అర్పించి అమరుడు అవ్వడం చాలా బాధాకరమని,మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని,నాయక్ త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరవదని, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని తెలిపారు.నివాళులు అర్పించిన వారిలో మండల నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు
వీర జవాన్ మురళీ నాయక్ కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి
RELATED ARTICLES