Wednesday, February 5, 2025

వీరు ప్రభుత్వ అధికారులా యాచకులా?

వీరు ప్రభుత్వ అధికారులా యాచకులా?

ఇసుక క్వారీలలో యాచకుల అవతారమెత్తిన ప్రభుత్వ ఉద్యోగులు.

వాళ్లకు అంత ఇచ్చారు మాకు ఎంత ఇస్తారు అంటూ భేరాసారాలు 

మీరు ఎంతైనా తవ్వుకోండి  కమిషన్లు మాత్రం ఇవ్వండి అంటూ పరస్పర ఒప్పందాలట. 

ఇసుక మాఫియా వద్ద పైకం కోసం క్యూ కడుతున్న టిఎస్ఎండిసి అధికారులు,

మండల తాసిల్దార్ అంటూ అనేక ఆరోపణలు.  దీనంతటికీ కర్త కర్మ క్రియ టిఎస్ఎండిసి పి ఓ సారే అంటూ షికారులు పుకార్లు.

ములుగు జిల్లా  వెంకటాపురం వాజేడు, ఏటూరు నాగారం మండల కేంద్రంలో  రామచంద్రపురం సురవీడు, రాంపురం, చుంచుపల్లి, అంకన్న గూడెం  గ్రామంలో  ఇసుక దందా టిఎస్ఎండిసి అధికారుల ప్రమేయంతో అధిక మొత్తంలో వసూలు చేస్తూ  లీగల్ గా జరుగుతున్నట్టు  పరిణామాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి, గత కొంతకాలంగా జరిగినలారీ డ్రైవర్ల ఆందోళనతో గతంలో లారీ లోడుకు 5000 తీసుకున్న ఇసుక మాఫియా  వారి రూట్ మార్చి లారీ లోడింగ్ కు 1500 తీసుకుంటూ మిగతా డబ్బులు ఎక్స్ట్రా బకెట్ల రూపంలో దండుకుంటున్నారు,బకెట్ కు  రెండు వేల రూపాయలు చొప్పున తీసుకుంటు పాత పైకానికే సరితూగేలా సమం చేశారు. ఈ విషయం ఎవరో చెప్పింది అంటే పొరపాటే సాక్షాత్తు  ఇసుక క్వారీలో పనిచేస్తున్న కమిటీ సభ్యులే బహిర్గతం చేయడం గమనార్హం. లారీ లోడింగ్ కు 1500   జెసిబి లోడింగ్ చేయడానికి 500 రూపాయలు సీరియల్కు 200 రూపాయలతో  వారి విక్రయాలు కాపు కొచ్చిన పంట పొలంల కళకళలాడుతున్నాయి. ఈ ఇసుక దందాలో ప్రభుత్వ అధికారుల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. క్వారీలలో ఎవరి దందా వారిదన్నట్టుగా ఎన్విరాన్మెంట్ అధికారులు,మండల రెవెన్యూ  అటవీ శాఖ, టిఎస్ఎండిసి అధికారులు ఎవరి వాటా వారు తీసుకొని వెళ్తున్నారు అంటూ ర్యాంపు నిర్వాహకులే బహిర్గతంగా చెప్పడం విశేషం. దానికి ఆద్యం పోస్తూ  ప్రభుత్వ అధికారులు సైతం ఇసుక నిర్వాహకుల పట్ల నిర్లక్ష్య ధోరణి చూపెట్టడం  తూతూ మంత్రంగా పర్యవేక్షించడం   ఎంత తవ్వుకున్న దానికి లెక్క అడగకపోవడం, హద్దులు దాటిన దానికి కొలత ఉండకపోవడం లంచాలకు మంచమేసి నట్టుగా వారి వైఖరి ప్రత్యక్షంగా కళ్ళముందే కనబడుతుంది. ఇక మండల తహసిల్దార్ విషయానికొస్తే రెండు నెలల క్రితం విధులు నిర్వర్తించిన ఎమ్మార్వో ఆఫీసులో ఉన్నప్పుడు సింహంలా గర్జిస్తూ  ఇసుక క్వారీల వద్దకు వెళ్ళినప్పుడు  ఇసుక నిర్వాహకుల ముందు తల దించుకొని  ఫలానా శాఖ వారికి అంత  ఇచ్చారు, మాకు ఇంత ఇవ్వండి అంటూ బిక్షాటన చేశారు అనీ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇక ఫారెస్ట్ అధికారుల విషయానికొస్తే  అడవికి ఇసుక క్వారీలు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉండాలి అప్పుడే ఆ ఇసుక క్వారీలకు క్లియరెన్స్ ఇవ్వాలి, ఒంటి చింతగూడెంలో ఇసుక క్వారీ మాత్రం అడివిలోనే ఉండడం  ఫారెస్ట్ అధికారుల పనితీరు ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది. ఇన్ని అక్రమాలకు వివిధ శాఖల వారు ఇసుక క్వారీ నిర్వాహకులతో చేతులు కలిపి పిసా చట్టాన్ని ఉల్లంఘిస్తున్న తీరుపైఏ రాజకీయ ప్రజాప్రతినిధులు సైతం ప్రశ్నించని పరిస్థితులు అందరూ దొంగలే అన్నచందంగా  ఉంది అంటూ మండల ప్రజల ఆరోపిస్తున్నారు. ఇసుక క్వారీలలో ఇన్ని అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో  తేజ న్యూస్, క్యు న్యూస్ రిపోర్టర్  స్వయంగా ఆధారాలతో టిఎస్ఎండిసి పీవో వద్ద ఫిర్యాదు చేసిన మేరకు చర్యలు తీసుకుంటాము అన్న పెద్ద సారు  వైభోగం ఇసుక ర్యాంపు నిర్వాహకుల నోటి ద్వారా టీఎస్ఎండిసి పిఓ కు మేము డబ్బులు చెల్లించాము అని చెప్పడంలో తేటతెల్లమయింది . దానికి తగ్గట్టుగానే  టిఎస్ఎండిసి పిఓ  చర్యలు  ఉండటం  కంచ చేలు మేసిందన్న  చందంగా ఉంది అని  ప్రభుత్వ అధికారులపై మండల ప్రజానికం  ధ్వజమెత్తుతున్నారు.  ఇదిలా ఉండగా  చుంచుపల్లి ఇసుక క్వారీలో మరి దారుణం  నిర్వాహకులే మీ దిక్కున కాడ చెప్పుకోండి అని విలేకరులపై విరుచుకు పడడం ప్రస్తుతం సంచలనంగా మారింది. రాంపురం ఇసుక క్వారీ పరిస్థితి కూడా ఇదే తరహా , కానీ కొంచెం భిన్నంగా రామచంద్రపురం అంకన్నగూడెం సురవీడు నిర్వాహకులతో కలిసి  టిఎస్ఎండిసి అధికారి కి పైకం చెల్లించాము మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బహిరంగంగా ప్రకటించడం  జరుగుతోంది అని  పాత్రికేయులు సైతం బహిర్గతం చేశారు. భయం లేని వారి వ్యాపారం వెనక గట్టిగా వినిపిస్తున్న పేరు  టీఎస్ఎండిసి పిఓ  తాసిల్దార్, ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్  అధికారి పేర్లు రావడం  ఆలోచించేలా చేస్తోంది. కంచ చేలమేసినట్టుగా ఐక్యతతో కూడిన ప్రభుత్వ అధికారుల చీకటి కోణం  ఇసుక నిర్వాహకులే బహిర్గతం చేస్తుండడం పట్ల మండల మంత  ఒక్కసారిగా ఉలికి పడింది.  ఈ ప్రభుత్వ అధికారులకు రామచంద్రపురం సురవీడు ర్యాంపులో వాటాలు కూడా ఉన్నట్టు  మండల ప్రజలు గుసగుసలాడుతున్నారు.  ఏది ఏమైనాప్పటికీ జరుగుతున్న పరిణామాల రిత్యా అధికారులే ఇసుక  అక్రమ దందా విషయంలో అంధులై న కారణంగా జిల్లా కలెక్టర్ స్పందించి  వీరు చేస్తున్న అక్రమ దందాపై ఉక్కు పాదం మోపి  పిసా  చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని  ఇటు గిరిజన సంఘాలు యావత్ మండల ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular