తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం పట్టణంలోని పడమర హరిజనవాడలో ఆరు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న నిషా, శర్మ గత మూడు రోజుల క్రితం నిషా అనే వివాహిత ఆత్మహత్య కు పాల్పడడంతో మెరుగైన వైద్యం కొరకు తిరుపతి తరలించగా చికిత్స పొందుతూ మృతి. నిషాకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు రహదారిపై ధర్నా. ఆరేళ్ల దాంపత్య జీవితానికి ఒకటిన్నర సంవత్సరం పాప, నిషా భర్త శర్మ అక్రమ సంబంధాన్ని నిలదీయడంతో భార్యపై దాడి చేసి అవమానించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నంకు పాల్పడిందని ప్రజలు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిషామృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిషా మృతికి కారుకులైన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆమెకు న్యాయం చేస్తామని తెలిపిన పోలీసులు.
వివాహిత ఆత్మహత్య నిషాకు న్యాయం చేయాలంటూ ప్రజలు రహదారిపై ధర్నా
RELATED ARTICLES