ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట
జానపద నవయుగ మణికంఠ కోలాటం,కోలాట కళా నృత్య వైతాళికుడు మణికంఠ గురువు ఆధ్వర్యంలోదేశ రాజధాని ఢిల్లీలో వేంకటేశ్వర స్వామి ఆలయం లో అనేక సన్మానాలు సత్కారాలు తో ఈ పదాలు వాక్యాలు రాయండి కోలాటం వర్ధిల్లుతూ తిరుమల తిరుపతి దేవస్థానం లో స్వామి వారి సేవలో పాల్గొంటూ జానపద కళలకు పూర్వవైభవనం తీసు కురావాలన్న సదాశయంతో ఉన్నత విద్యా వంతులు, కళాభిమానులు, కళాకారులు సంకల్పంతో చేస్తున్న ప్రయత్నాలు సఫలీ కృతమవుతున్నాయి. ఆధ్యాత్మిక, మానసిక ఉల్లాసంతో కళలకు పునరుత్తేజం తీసుకొ స్తున్నారు. జగ్గయ్యపేట, కోదాడ, ఖమ్మం కేంద్రంగా…. తెలుగు రాష్ట్రాల పరిధిలో మహిళా కోలాటంలో 128 బృందాలతో మణికంఠ కోలాటం ఏర్పాటు చేశారు. మాస్టర్ మణికంఠ శిక్షణలో రాష్ట్రాల పరిసర ప్రాంతాలకు చెందిన కళాకారులు ఇందులో ఉన్నారు. వివిధ పండుగ పర్వదినం సందర్భంగా వినూత్నంగా ప్రదర్శించిన నీరాజనాలు, ప్రశంసలతో జ్ఞాపికలను అందుకు న్నారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో అన్నమయ్య, శివనామ కీర్తనలతో ఆకట్టుకునేవిధంగా కళాభిమానులను మెప్పిస్తున్నారు. తితిదే ఆలయాల మెట్లోత్సవాల్లో ఆరాధన ఉత్సవాలలలో బ్రహ్మోత్సవాలలో, ఆధ్యాత్మిక విశేషాలు సందర్భంగా బృందంలోని మహిళలు వెళ్లి కోలాటం ప్రదర్శనలతో రాణిస్తున్నారు.
మణికంఠ కోలాటం వర్ధిల్లుతూ తిరుమల తిరుపతి దేవస్థానం లో స్వామి వారి సేవలో
ఏకరూప వస్త్రధారణతోపాటు చక్కగా ప్రదర్శించారు. గోవిందుడెలరాడే.. గోపాలుడే లరాడే’ పల్లవి చరణంలో కోలాట కర్రలతో వివిధ భంగిమల అభి నయంతో అభినయిచడంతో కళాభిమానులు హర్షధ్వనులతో
ప్రత్యేక గుర్తింపు ఆనందదాయకం
(నా పేరు కొత్తగూడెం అరుణ, ప్రైవేటు పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు సాంస్కృతిక కార్య క్రమాల్లో కోలాటంపై శిక్షణపై ఆసక్తి కలిగింది. నేర్చుకుని సొంత ఖర్చులతో వెళ్లి కళా సేవలో పురోగమిస్తున్నాం. మణికంఠ కోలాట నృత్య ప్రదర్శన ద్వారా ప్రత్యేక గుర్తింపు లభించడం అదృష్టంగా భావిస్తున్నాను). (నా పేరు లక్ష్మి ఖమ్మం.. వృత్తి రిత్యా డీలర్ గా ఉంటు కోలాటం కళలో శిక్షణ పొంది బతుకమ్మ వినాయక చవితి సంబరాల్లో ప్రదర్శన ఆనందంగా ఉంది) (నా పేరు రమాదేవి కోదాడ గ్రామ పెద్దలు టీం లీడర్, కోలాటం అనే కళా నృత్య విద్య నేర్చుకుని అనేక రకాల పండుగ, వివాహ వేడుకల్లో, దైవ కార్యక్రమం లో ఆనందం గా పాల్గొంటూ ఒక యూనిటీ గా ఉండటం సంతోషకరం..) నా పేరు నాగలక్ష్మి జగ్గయ్యపేట మా ఊరి దేవాలయం లో సంప్రదాయ బద్ధంగా ప్రదర్శన చేస్తూ నేటి యువత లో ఐకమత్యం పెంపోందుటకు ఈ కళా నృత్యం ఎంతో మేలు చేస్తుంది పెద్ద చిన్న పండగ వాతావరణం లో కళాభీమానులను ఆనందపరుస్తూ నవ సమాజ నిర్మాణం కోసం ప్రయత్నం లో భాగస్వామిగా ఉన్నందుకు ధన్యవాదాలు తో మణికంఠ కోలాటం టీం లీడర్…
వినూత్న ప్రదర్శనల్లో మణికంఠ కోలాటం కళాకారులు
RELATED ARTICLES