సంగెం మండల తేజ న్యూస్ టివి ప్రతినిధి.
75వ గణతంత్ర వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్న వి. నరసింహారావు ఏడీఈ కాపుల కనపర్తి . నిరంతర కార్యశీలి, ఉత్తమ సేవా తత్పరుడు , పనిని ఆయుధంగా మలుచుకొని నిరంతరాయంగా విద్యుత్ సరఫరా లో కీలక పాత్ర పోషించి అనేక సమస్యలను ఛేదించి వినియోగదారుల మనలను పొందుకుంటూ, ఇటు డిపార్ట్మెంట్ కి ఎంతో ఆదా కల్పించి. కిందిస్థాయి ఉద్యోగులతో సోదర భావంతో ప్రతి కింది స్టాప్ యొక్క మనుషులను దోచుకుని వారిని కార్యోన్ముఖులను చేసి సంస్థను ముందుకు తీసుకపోవడంలో కీలక పాత్ర పోషించినారు. ఇలాంటి అధికారిని డిపార్ట్మెంట్ గుర్తించి ఉత్తమ అధికారిగా గుర్తించడం జరిగినది. కష్టపడే మనస్తత్వం అది అతని సొంతం . ఇంతకుముందు కన్స్ట్రక్షన్ విభాగంలో పనిచేసి అనేక సబ్స్టేషన్ నిర్మించడంలో కీలక పాత్ర పోషించినారు గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ విద్యుదీకరణ స్కీములో ముందుకు తీసుకెళ్లి పేదవారికి విద్యుత్ అందించడం జరిగినది. ఎమ్మార్టీ విభాగంలో పనిచేసి ట్రాన్స్ఫార్మర్ రిపేరు సెంటర్లో నాణ్యమైన ట్రాన్స్ఫార్మర్లు వైండింగ్ చేయించడంలో కీలక పాత్ర పోషించినారు డిపార్ట్మెంట్ కి ఎంతో ఆదా చేయడం జరిగినది. ఇలాంటి అధికారికి జిల్లా కలెక్టర్ చే ఉత్తమ అవార్డు రావడం విద్యుత్ సిబ్బంది, అవార్డ్ మధుసూదన్ సూపరింటెండెంట్, ఇంజనీరింగ్ ఆపరేషన్ వరంగల్ బిక్షపతి డివిజనల్ నా తోటి అధికారులందరూ మరియు వినియోగదారులు ఆనందం వ్యక్తం చేయుచున్నారు.
విద్యుత్ శాఖ అదికారి ఏడిఇ వి. నర్సింగరావు కు ఉత్తమ సేవా అవార్డు
RELATED ARTICLES