తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండల కేంద్రంలోని మార్గం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పదవ తరగతి శిక్షణ శిబిరంకు హాజరై మాట్లాడుతూ పిల్లలకు చిన్నప్పటినుంచి విలువలతో కూడిన విద్యను అందించినప్పుడే మెరుగైన సమాజ నిర్మాణం జరుగుతుందని ప్రముఖ సైకాలజిస్ట్ గుండేటి శ్రీకాంత్ అన్నారు. పాఠశాలల్లో, మార్గం స్వచ్ఛంద సేవా సంస్థ ఉచిత శిక్షణ సెంటర్, ఎంత చదివిన విద్యార్థుల ప్రవర్తనలు మార్పునకు తల్లిదండ్రుదే కీలకపాత్ర అన్నారు. విద్యార్థులు సమాజాభివృద్ధికి పాటుపడాలని ఆత్మగౌరవం, స్వయం క్రమశిక్షణ, సేవ ,శౌర్యం, సమర్పణ వంటి ఉత్తమ గుణాలు కలిగి ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో మార్గం స్వచ్ఛంద సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ సురేశ్, సింగారపు బాబు. కరుణ శ్రీ, కిషన్ కుమార్, సునీత విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ప్రవర్తన తల్లిదండ్రులదే కీలక పాత్ర
RELATED ARTICLES