TEJA NEWS TV
మలుగు జిల్లా ఎటునాగారం మండల కేంద్రంలో డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమం టాస్క్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాస్క్ జిల్లా కోఆర్డినేటర్ రామకృష్ణ హాజరయ్యారు.
అనంతరం టాస్క్ ఆధ్వర్యంలో కొనసాగే వివిధ కార్యక్రమాల, నూతన కోర్సుల గురించి విద్యార్థులతో ఆయన చర్చించారు, ఏ కోర్స్ చేస్తే ఎంత ఉపయోగం ఉంటుందో క్షుణ్ణంగా విద్యార్థులకు తెలిపారు. నూతన యుగంలో నూతనంగా టెక్నికల్ కోర్స్ విభాగంలో పట్టు సాధించే దిశగా అడుగులు వేయాలని విద్యార్థులకు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆచార్యులు డాక్టర్ బి రేణుక, మెంటల్ రమేష్, అధ్యాపకులు నవీన్, వెంకటయ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచుకోవాలి – టాస్క్ జిల్లా కోఆర్డినేటర్ రామకృష్ణ
RELATED ARTICLES