విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలను పెంపొందించడంలో భాగంగా లిప్ కార్యక్రమాన్ని నిర్వహించిందని ఒంటిమిట్ట మండల విద్యాశాఖ అధికారి జి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆయన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒంటిమిట్టలో సిద్ధవటం, అట్లూరు, ఒంటిమిట్ట మండలాలకు జరిగిన ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు సమావేశానికి హాజరయ్యారు.వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా ప్రమాణాలు పెంపొందించడంలో భాగంగా అనేక నూతన కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. విద్యార్థులకు చతుర్విధ ప్రక్రియలు, చదవడం రాయడం కూడా రావడం లేదని అన్నారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు లెసన్ ప్లాన్ తయారు చేసుకోవడం లేదని, పాఠ్యాంశానికి సంబంధించిన ముఖ్య కీలక భావనలను బోర్డు బై కూడా రాయడం లేదని, పాఠాన్ని కేవలము చదవడం చేస్తున్నారని, తరగతిలో ఉన్న విద్యార్థులు అందరినీ దృష్టిలో ఉంచుకోవడంలేదని విద్యా అధికారులు సూచించారని ఆయన తెలిపారు. విద్యలో విద్యా ప్రమాణాలను పెంపొందించే దిశగా తర్ఫీదు పొందాలని సూచించారు. మ్యాథమెటిక్స్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులకు రెండు రోజులపాటు ఒంటిమిట్ట మండలంలో శిక్షణ నిర్వహిస్తున్నామని అన్నారు. సిద్ధవటం మండలంలో తెలుగు, ఇంగ్లీషు సబ్జెక్టు ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించారని అన్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఆర్పీలు ఇచ్చిన సమాచారమును స్వీకరించాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉన్నచో శిక్షణ సమావేశంలోనే నివృత్తి చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆర్పీలు జిల్లా స్థాయిలో శిక్షణ పొందాలని, వారి అమూల్యమైన సమాచారమును ప్రతి ఒక్కరు స్వీకరించాలని సూచించారు. సబ్జెక్టు పై ఎలాంటి సందేహాలు ఉన్న ఆయా సబ్జెక్టుల అర్పిల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. శిక్షణను ముగించుకొని బయటకు వెళ్ళేటప్పటికి సంపూర్ణ సబ్జెక్టుతో వెళ్లాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. వీరు బోధించిన విషయాలను పాఠశాలలోని విద్యార్థుల స్థాయికి తీసుకువెళ్లి వారిలో బోధనపరంగా మార్పులు వచ్చే విధంగా చూడాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వెంకట లక్ష్మమ్మ, ఆర్పీలు, సిఆర్పీలు, మూడు మండలాలకు చెందిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంపొందించాలి
RELATED ARTICLES