Sunday, January 18, 2026

విద్యార్థులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన..నిలదీయడంతో విధులకు డుమ్మా

TEJA NEWS TV TELANGANA

విద్యార్థులతో అసభ్యంగా మాట్లా డడం, తీవ్రంగా దండించడం చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు నిలదీయడంతో ఇరవై రోజులుగా పాఠశాలకు రావడం లేదు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..మెదక్ జిల్లా చేగుంట మండలం కరీంనగర్ ప్రాథమిక పాఠశాలలో పూర్ణచందర్

ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. చిన్న విషయాలకే విద్యార్థినీ విద్యార్థులను బూతులు తిడుతూ, పనిష్మెంట్లు ఇస్తున్నారు.3

పిల్లలను ఒకరిచే మరొకరిని కొట్టిస్తున్నారు. రోజూ ఇదే విధంగా

ప్రవర్తించడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు విషయం తెలిపారు.ef

దీంతో ఆగస్టు  11 తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని

నిలదీశారు. వారు మాట్లాడుతుండగానే జారుకున్న ఉపాధ్యాయుడు

ఇప్పటి వరకు పాఠశాలకు హాజరు కాలేదు. ఈ విషయంపై ఎంఈవో నీర జను వివరణ కోరగా గ్రామస్థులు ఫిర్యాదు మేరకు పాఠశాలను సందక

ర్మించి విద్యార్థులతో మాట్లాడినట్లు తెలిపారు. పూర్ణచందర్ అసభ్యంగా

తిడుతున్నారని, చీటికీమాటికి కొడుతున్నారని, ఇబ్బందులకు గురిచేస్తున్నా రని విద్యార్థులు చెప్పారన్నారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారికి

నివేదించినట్లు ఎంఈవో తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular