సంగెం మండల కేంద్రంలో మార్గం స్వచ్ఛంద సేవ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వేసవి వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం జరిగింది. *దాత.బిట్ల.శ్రీయాన్ష్ ఆల్ ఇన్ వన్ పుస్తకాలు*అందజేత* , వచ్చే విద్యా సంవత్సరం (2024-25) తల్లి, తండ్రి లేని పిల్లలు, అనాధలు, నిరుపేద, పేద, *పదవ తరగతి* విద్యార్థులకు విద్యార్థులకు ఉచితంగా ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ పుస్తకాలు జూన్ 09 ఆదివారం 2024 రోజున చేయడం జరిగినది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై వ్యాపారవేత్త బిట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మార్గం ఆధ్వర్యంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.మన సంపాదనలో కొంత పేదలకు సహాయం చేస్తే ఆనందం, సంతోషం వస్తుంది. ఇంట్లో శుభకార్యాలకు, మీ పుట్టినరోజు ప్రతి ఒక్క విద్యార్థి ఒక మొక్కను నాటి, పోషించాలని కోరారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై కెనరా బ్యాంక్ ఆఫీసర్ దిడ్డి కోటేశ్వర్ మాట్లాడుతూ నిరుపేద, పేద, తల్లిదండ్రులేని విద్యార్థులకు దాతల ద్వారా సహాయం అందించడం మార్గం కు అభినందనీయం అన్నారు. విద్యార్థులు దాతలు, ప్రభుత్వము,మార్గం స్వచ్ఛంద సేవా సొసైటీ అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకొని ఉన్నతంగా చదివి,ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు సైకాలజిస్ట్ బొజ్జ సురేశ్, సింగారపు బాబు, దాత.బిట్ల.శ్రీయాన్ష్,బిట్ల అవనిష్ కుమార్ వందన,బిట్ల శ్రీనివాస్ భాగ్యలక్ష్మి,కెనరా బ్యాంక్ ఆఫీసర్ దిడ్డి కోటేశ్వర్ శోభారాణి,బిట్ల శ్రావణ్ దివ్యశ్రీ కేతన్,సాయి,రెవన్ష్,దర్శన్,సిద్దు,వెంకటేశ్,పాండ్రాల కరుణ ,పాండ్రాల.కిషన్ కుమార్,విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు విద్యాభివృద్దికి పుస్తకాలు సహాయం చేయడం ఎంతో ఆనందం : బిట్ల.శ్రీయాన్ష్
RELATED ARTICLES