ఎన్టీఆర్ జిల్లా TEJA NEWS TV
విజయవాడ: ఇంద్రకిలాద్రి శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కల్పిస్తున్న సదుపాయాల్లో లోటుపాట్లను ఆలయ అధికారులకు భక్తులు వాట్సాప్ నంబరు ద్వారా తెలియజేయొచ్చు.
ఇందుకోసం దేవస్థానం 94418 20717 నంబరు అందుబాటులోకి తెచ్చింది. అమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులకు దేవస్థానం ప్రసాదాలు, అన్న ప్రసాదం అందజేస్తోంది.
ఆయా సేవల్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. సదుపాయాలపై సూచనలు, సలహాల తో పాటు ఆలయ సమాచారం సైతం ఈ వాట్సాప్ ద్వారా అందించొచ్చు.
భక్తుల సూచనలు, ఫిర్యాదులపై ఆలయ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారనే సమాచారాన్ని వెల్లడిస్తారు.
విజయవాడ : ఇంద్రకిలాద్రిపై ఎటువంటి లోటుపాట్లు ఉన్నా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు
RELATED ARTICLES