TEJA NEWS TV:
హోళగుంద స్థానిక బస్టాండ్ నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గోడ పత్రికలు విడుదల చేస్తు ఆంధ్రప్రదేశ్ రైతులు సంఘం జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్ మాట్లాడుతూ రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణం, పరిశ్రమల కొరకు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి. 2022 ఖరీఫ్ లో పంటలు దెబ్బతిన్న రైతులకు పంటల భీమా, నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలి, రైతుల ఖాతాల్లో వేయాలి.
గత ఏడాది నవంబరు, డిశంబరు, ఈ ఏడాది ఏప్రిల్, మే మాసాలలో వచ్చిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని, రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం విత్తనం నుండి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలు చూసుకుంటాయని చెప్పినప్పటికీ, ఎక్కడ అలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా రైతాంగం నానా అవస్థలు పడ్డారు. నకిలీ విత్తనాలు, అకాల వర్షాలతో 2022 ఖరీఫ్లో పత్తి, మొక్కజొన్న, ఉల్లి, టమోటా వంటి | పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిని రైతాంగం నష్టపోయారు. వారికి ఇప్పటి వరకు పంటల భీమా ఇన్పుట్ సబ్సీడి వంటివి. ఏవి ప్రభుత్వం ఇవ్వలేదు. పంటల భీమా విడుదల చేయాలని, కలి | విత్తనాలు అరికట్టాలని, నాణ్యమైన విత్తనాలు ఆరిబికెల ద్వారా రైతులకు అందించాలని, ఎరువుల ధరలు నియంత్రించాలని, రైతులు పండించే పంటలకు మద్దతు ధరలు ఇవ్వాలని, జిల్లాలో కరువు నివారణ కొరకు వేదవతి రిజర్వాయర్ల నిర్మాణం, ఆర్డియస్ కుడి కాలువ | నిర్మాణం తక్షణం పూర్తి చేయాలని, 106 చెరువులకు నీళ్ళు నింపాలని, హంద్రీనీవా పంటకాలువ నిర్మాణం పూర్తి చేయాలి, సున్నా వడ్డీ రాయితీ బకాయులు బ్యాంకుల్లో జమ చేయాలని, | రుణపరిమితి పెంచి అమలు చేయాలని కోరుతూ జూన్ 21 నుండి 26 వరకు ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆరికె కేంద్రాలలో వినతిపత్రాలు ఇవ్వాలని జూన్ 30వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ లో జరిగే మహాధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయమని రైతాంగానికి విజ్ఞప్తి.
ఇన్పుట్ సబ్సిడీ, పంటల భీమా : గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ, పంటల భీమా వెంటనే విడుదల చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ ఆహార పంటలకు ఎకరాకు రూ.10,000/-లు వాణిజ్యపంటలకు రూ.25,000/-లకు పెంచాలి. 3. వడ్డీ రాయితీ: గత రెండు సంవత్సరాల నుండి సున్నా వడ్డీ పథకం, పావలా వడ్డీ | పథకాలకు ఇవ్వవలసిన నిధులు ఇవ్వడంలేదు. వెంటనే విడుదల చేయాలి. ఈకార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి నాగరాజు.సీనియర్ నాయకులు కట్టప్ప రాఘవేంద్ర.వెంకటేష్ .తదితరులు పాల్గొన్నారు
విజయవాడలో జరుగు మహాధర్నాకు తరలిరండి..ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
RELATED ARTICLES