వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ 4 వార్డు కుర్వ వీధి విద్యానగర్ కాలనీ లో గల కుర్వ బాలప్ప ఇల్లు మూడు నాలుగు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురిసిన అకాల వర్షాలకు కూలిపోవడం జరిగింది. ఇట్టి విషయం స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ వార్డు సభ్యులు కుర్వ లక్మన్న మున్సిపల్ చైర్మన్ గాయత్రి రవికుమార్ యాదవ్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు స్పందించి కూలిపోయిన ఇంటిని పరిశీలించి తాత్కాలిక నివాసం ఉండుటకు కురువ సంఘం కమ్యూనిటీ హాల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే వారికి కావలసిన నిత్యావసర సరుకులను అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో కండక్టర్ మల్లేష్, రావుల వెంకటేష్, కుర్వ మల్లమ్మ, బాలమ్మ, కర్రెమ్మ పాల్గొన్నారు.
వర్షాలకు పడిపోయిన ఇంటిని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ ఎం.గాయత్రి రవి కుమార్ యాదవ్
RELATED ARTICLES