ఎన్టీఆర్ జిల్లా/కంచికచర్ల : 08 జూన్ 2025.
కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామ సమీపంలో గల రిజర్వు ఫారెస్ట్ లో స్వయంభుగా వెలసి ఉన్న మద్దులమ్మ తల్లికి వరద పాయసంలో ఆదివారం నాడు స్థానిక కూటమి నేతలు మరియు గొట్టుముక్కల గ్రామ ప్రజలతో కలిసి వరద పాశం పోసిన ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పరిటాల, నక్కలం పేట, కంచికచర్ల, నరసింహారావు పాలెం గ్రామాలతో పాటు పలు గ్రామాలు ప్రజలు హాజరవుతారని. వర్షప్రదాయిని అయిన మద్దులమ్మ తల్లికి వరద పాశం పోస్తే వర్షాలు పడతాయని ఇక్కడి ప్రజల నమ్మకం అని ఆమె తెలియజేశారు.
వర్షప్రదాయిని అయిన మద్దులమ్మ తల్లికి వరద పాశం పోస్తే వర్షాలు పడుతాయి
ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య
RELATED ARTICLES