కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం మల్కాపూర్ గ్రామంలో కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, వరి పొలాలను సందర్శించడం జరిగింది. వాతావరణ మార్పుల వల్ల వరిలో బాక్టీరియా ఆకు ఎండు తెగులు గమనించడం జరిగింది. దీని నివారణకు ” స్ట్రెప్టోమైసీన్ సల్ఫేట్ 9% శాతం అన్న” – 100 శాతం గ్రాములు లేదా వలిడామైసీన్ 3% శాతం ఎల్ – 500 మీ.లీ ఎకరానికి చొప్పున పిచికారీ చేసుకోవాలి. అలాగే చాలా చోట్ల ముందుగా నాటిన వరి పంటలు పొట్ట దశలో ఉన్నాయి. ఆఖరి దఫాగా వేసే ఎరువులు వేసే మూడు రోజుల ముందు లేదా మూడు రోజుల తరవాత ” కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 75% శాతం ఎస్. జి 200 గ్రాములు మరియు (పికక్సీస్ట్రోబిన్ + ట్రైసైకలజోల్)- 400 మీ.లీ. మందులు పిచికారి చేసినట్లయితే తెల్ల కంకి మరియు మెడ కాటు రోగాలను నివారించి వరిలో దిగుబడి పెంచవచ్చని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ రాఘవేంద్ర, మరియు మల్కాపూర్ రైతులు పాల్గొన్నారు.