TEJA NEWS TV :
వరదయ్య పాలెం మండలం లోని తొండంబట్టు పంచాయతి లో జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం నాగనందపురం, ఎంజీ నగర్ యస్.టి.కాలని, ఎంజీ నగర్ అరుంధతి వాడ, సిద్ధాపురం, అంబికాపురం, తొండంబట్టు పంచాయతి లో నాగనందాపురం గ్రామంలో 30మంది వైఎస్సార్ సిపి నాయకులు తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే హేమలత ఆధ్వర్యంలో చేరారు. నాగయ్య వైఎస్సార్ సిపి సర్పంచ్ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ లో హేమలత సమక్షంలో పార్టీలో కుటుంబ సమేతంగా చేరడం జరిగింది. చంద్రన్న ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలందరికీ తెలియజేసి వారి అమూల్య మైన ఓటును మరో సారి ఒక్క సారి అని మోసగించిన వారికి వెయ్యకుండా మన సత్యవేడు తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మరియు అభ్యర్థి హెలెన్ కు ఓటు వేస్తే బాబు సీఎం చేసుకొని భావి తరాల భవిష్యత్ బాగు చేసుకోనే విధంగా ఆలోచించాలని అని మాజీ ఎమ్మెల్యే హేమలత ఇంటింటా తిరిగి వారి సమస్యలను తెలుసుకొంటు వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరదయ్య పాలెం తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి, క్లస్టర్ ఇంఛార్జి నాగరాజు యాదవ్,రావూరి భాస్కర్ నాయుడు, exఎం.పీ.టీ.సీ.చెంగయ్య, లోకనాథం, ప్రభాకర్,జనసేన నాగనందాపురం గ్రామ అధ్యక్షుడు వసంత్ కుమార్, జనసేన పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి తడ శ్రీను *తెలుగు దేశం పార్టీ వరదయ్య పాలెం మండల అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి , జనసేనా నాయకులు ,కార్యకర్తలు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
వరదయ్య పాలెం: బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ,జనసేన పార్టీ నాయకులు
RELATED ARTICLES