వరదయ్యపాలెం, తేజన్యూస్ టీవీ
వరదయ్యపాళెం శుక్రవారం వెలువడిన ఇంటర్ పరీక్షాఫలితాల్లో స్థానిక జూనియర్ కళాశాలలో ప్రథమసంవత్సరంలో 557శాతం, ద్వితీయసంవత్సరంలో 69.33శాతం ఉత్తీర్ణతసాదించినట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 60మందికి గాను 28మంది ఉత్తీర్ణత సాదించగా, ద్వితీయసంవత్సరంలో 75మందికి గాను 52 మంది ఉత్తీర్ణత సాదించినట్లు ఆమె వివరించారు. ఇందిరానగర్ పంచాయతీ పద్మావతిపురంనకు చెందిన కీర్తి (బైపీసీ) 300 మార్కులతో మండల టాపర్గా ప్రథమశ్రేణిలో నిలవగా, కన్మని(బైపీసీ) అనే విద్యార్థి 915 మార్కులతో ద్వితీయస్థానంలో నిలిచింది. అదేవిధంగా ప్రథమసంవత్సరంలో మహదీప్ 470 మార్కులకు 441 మార్కులతో ప్రథమశ్రేణిలో నిలవగా, సంధ్య(బైపీసీ) 440 మార్కులకు గాను 391 మార్కులు సాధించి ద్వితీయస్థానంలో నిలిచింది. టాపర్లుగా నిలిచిన విద్యార్ధులను ప్రిన్సిపల్, అధ్యాపకులు అభినందించారు. ఇదిలాఉండగా కొత్తగా ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రారంభమైన వరదయ్యపాళెం జెడ్పీ ఉన్నతపాఠశాలలో 33మందికి గాను పది మంది ఉత్తీర్ణత సాధించి 33శాతం ఉత్తీర్ణత సాధించింది.
వరదయ్యపాళెంలో 69శాతం ఉత్తీర్ణత
RELATED ARTICLES