వరదయ్యపాలెం సమీపంలో ఎన్టీఆర్ నగర్ వద్ద కుప్పకూలిన వంతెన (కల్వర్టు)
శ్రీకాళహస్తి _తడ రహదారి మార్గంలో స్తంభించిన రాకపోకలు
వరదయ్యపాలెం సమీపంలో బీఎన్ కండ్రిగ మండలం ఎన్టీఆర్ నగర్ వద్ద గల కల్వర్టు కుప్ప కూలింది. ఇటీవల వరదలకు కల్వర్టు కోతకు గురై బాగా దెబ్బతినడంతో కల్వర్టు హఠాత్తుగా కూలిపోయింది.కల్వర్టుపై గల రహదారికి పగుళ్లు ఏర్పడటంతో శ్రీకాళహస్తి _తడ రహదారి మార్గంలో రాకపోకలు స్తంభించాయి.తిరుపతి శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలకు చెన్నై తదితర ప్రాంతాలకు ప్రధాన మార్గం అయిన ఈ రహదారి మార్గంలో రాకపోకలు స్తంభించడoతో ప్రజలు వివిధ అవసరాలకి అత్యవసర పరిస్తితి ప్రాణాపాయ ప్రమాదకర వైద్య సేవలకు ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆర్ అండ్ బీ అధికారులు వెంటనే స్పందించి రహదారి రాకపోకలకు వీలుగా హుటాహుటిన కల్వర్టు మరమ్మతులు చేపట్టి పునరుద్ధరణ చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.
వరదయ్యపాలెం సమీపంలో ఎన్టీఆర్ నగర్ వద్ద కుప్పకూలిన వంతెన (కల్వర్టు)
RELATED ARTICLES