TEJA NEWS TV:
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను మానుకోవాలని సి ఐ టీ యు నాయకులు గౌస్ బాషా కోరారు.విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్న నేపథ్యంలో దీనిపై నిరసిస్తూ బుధవారం గౌస్ బాషా ఆధ్వర్యంలో విద్యార్థులు బంద్ నిర్వహించారు.ఈ సందర్భంగా సి ఐ టీ యు నాయకులు గౌస్ బాషా మాట్లాడుతూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడం కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు.లాభాల బాటలో నడుస్తున్న విశాఖ పరిశ్రమను బడా బాబుల గుప్పెట్లోకి పెట్టొద్దు అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఎందరో ప్రాణాలు కూడా గాలిలో కలిసిందన్నారు.తద్వారా విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కు అన్నారు.విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసి ఆంధ్రుల నోట్లో మట్టి కొట్టొద్దు అన్నారు.అలాగే కడప ఉక్కు పరిశ్రమ కోసం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన నిధులు విడుదల కాలేదు అన్నారు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో విశాఖ ఉక్కు కర్మాగార తరహాలోనే ఇక్కడ కూడా పరిశ్రమను స్థాపించి ఈ ప్రాంత అభివృద్ధికి చొరవ చూపాలని అన్నారు.అంతకు మునుపు విద్యార్థి యువజన సంఘం నాయకులు ప్రభుత్వ బాలుర,బాలికల, జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులను బహిష్కరించి బంద్ నిర్వహించారు
వరదయ్యపాలెం: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను మానుకోవాలి
RELATED ARTICLES