TEJA NEWS TV: వాలీబాల్ టోర్నమెంట్ కు విశేష స్పందన
వరదయ్యపాలెం మండలంలోని గోవర్ధనపురం జడ్పీ హైస్కూల్ సమీపంలో నిన్న ఘనంగా ప్రారంభమైన వాలీబాల్ టోర్నమెంట్ కు చుట్టుపక్కల ప్రాంతాలు ,జిల్లాల నుండే కాకుండా కర్ణాటక ,తమిళనాడు నుండి కూడా వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి విచ్చేసిన జట్లు…
నిన్న యువ నాయకులు యువ ప్రజా ప్రతినిధుల మధ్య అట్టహాసంగా ప్రారంభమైన టోర్నమెంట్ ఈరోజు సాయంత్రం వాలీబాల్ పోటీల్లో ఇతర రాష్ట్రాల నుండి కూడా పాల్గొంటున్న విశేషం…
ఏది ఏమైనా ఈ సందర్భంగా వరదయ్యపాలెం పి ఈ టీ మాస్టర్ కుమార్ మరియు గోవర్ధన్ పురం పీఈటి మాస్టర్లు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సత్యవేడు నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా వరదయ్యపాలెం మండలంలో వివిధ క్రీడా పోటీల్లో విద్యార్థులు యువకులు, జిల్లాస్థాయిలో రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారని ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు గమనించి మండలంలో ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రదేశంలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి వారికి ప్రోత్సహించే విధంగా ముందడుగు వేయాలని తద్వారా విద్యార్థులలోని క్రీడాకారులకు మంచి శిక్షణ ఇచ్చి రాష్ట్రస్థాయిలో దేశ స్థాయిలో రాణించే విధంగా తీర్చి దిద్ది అవకాశాలు ఉన్నాయని వెంటనే జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకుని వెళ్లి క్రీడా మైదానాని ఏర్పాటు చేసే దిశగా క్రీడాకారులను ప్రోత్సహించాలని స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు…
వరదయ్యపాలెం: వాలీబాల్ టోర్నమెంట్ కు విశేష స్పందన
RELATED ARTICLES