TEJA NEWS TV :
వరదయ్యపాలెం,తిరుపతి జిల్లా.
వరదయ్యపాలెం మండలం మరదవాడ సచివాలయ పరిధిలో కోలాహలంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించారు.పంచాయతీ సర్పంచ్ సాకమూరి లైలమ్మ కుమారుడు,సాకమూరి కుమార్ సంయుక్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడాలో క్రికెట్ కబాడీ పోటీలకు ప్రారంభోత్సవం చేశారు.జడ్పీటీసీ కుందాం వెంకటేశ్వర్లు,స్థానిక ఎంపీటీసీ హేమలత భర్త,వైసీపీ మండల కన్వినర్ దయాకర్ రెడ్డి అతిధులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో,ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడల్లో అంతర్గతంగా యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత క్రీడాకారులపై ఉన్నట్టు తెలిపారు.గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.సచివాలయ స్థాయి నుంచి,మండల,నియోజకవర్గం,జిల్లా,రాష్ట్ర స్థాయి వరకు ఆటల పోటీలు జరుగుతుందన్నారు.గ్రామీణ క్రీడాకారులు కూడా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వారి సత్తాను సాటి మండలానికి గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ క్రీడలో క్రికెట్ లో మరదవాడ జట్టు గెలుపొందింది.కబడ్డీలో అంబూరు,వాలీబాల్ లో ఆంబూరు గెలుపొందాయి.ఈకార్యక్రమంలో సచివాలయ సిబ్బంది,శివ యాదవ్,మురళి రెడ్డి,క్రీడాకారులు పాల్గొన్నారు.పాండూరు సచివాలయం పరిధిలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుందాం వెంకటేశ్వర్లు,సర్పంచ్ కవిత కిష్టయ్య,ఎంపీటీసీ అంకమ్మ చిన్నెయ్య,వైసీపీ మండల కన్వినర్ దయాకర్ రెడ్డి, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యంరాజు,పంచాయతీ కార్యదర్శి తిరుమల,సచివాలయ సిబ్బంది,ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
వరదయ్యపాలెం: మరదవాడ,పాండూరు సచివాలయ పరిధిలో ఆడుదాం ఆంధ్ర క్రీడలు
RELATED ARTICLES