వరదయ్యపాలెం మండల నూతన తహశీల్దార్ రాజశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వరదయ్యపాలెం మండలంలో రీ సర్వే డిప్యూటి తహసీల్దార్ గా విధులు నిర్వహించి ఎన్నికల సమయంలో తహసీల్దార్ గా పదోన్నతి లభించి అనంతపురం కి వెళ్లారు.అక్కడ విధులు నిర్వహించిన ఎన్నికలు అనంతరం వరదయ్యపాలెం తహశీల్దార్ గా వచ్చారు సందర్భంగా తహశీల్దార్ రాజశేఖర్ మాట్లాడుతూ మండలములోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కులం, ఆదాయం ధ్రువపత్రాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరువచేసి మండలాన్ని అభివృద్ధి బాటలోన నడిపిస్తామన్నారు. అనంతరం వీఆర్వోలు వీఆర్ఏ రెవెన్యూ సిబ్బందితో సమావేశమయ్యారు.సిబ్బంది అందరూ తమవిధులు పట్లబాధ్యతగా వ్యవహరిస్తూప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరంరెవిన్యూ సిబ్బంది, వీఆర్వోలు,వీఆర్ఏలు
నూతన తహాశీల్దార్ కు శుభాకాంక్షలు తెలిపారు.
వరదయ్యపాలెం మండల తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన పి.రాజశేఖర్
RELATED ARTICLES