వరదయ్యపాలెం, సెప్టెంబర్ 14 ( తేజ న్యూస్ టీవీ )
వరదయ్యపాలెం మండలం, గోవర్ధనపురం నందు లోకా ఫౌండేషన్ కార్యాలయం నందు ఉమా మహేశ్వర వ్రతం ఘనంగా నిర్వహించారు.ఆధ్యాత్మిక విభాగం ఆధ్వర్యంలో బుధవారం, భాద్రాపద మాసం,పౌర్ణమి, ఉమామహేశ్వర వ్రత పుణ్యదినమును పురస్కరించుకొని వరదయ్యపాలెం, గోవర్ధనపురం లోని లోకా ఫౌండేషన్ కార్యాలయ ఆవరణలో మృత్యుంజయ సహస్రనామ అష్టోతర పూజ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. మహాదేవుని దివ్యానుగ్రహానికి,పాప కర్మలనుండి విముక్తులుకాగలరని, ఆయు ఆరోగ్య సంపాదలతో విలసిల్లగలరని అధ్యాత్మిక కో ఆర్డినేటర్ బొప్పన రమేష్ అన్నారు.పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.పురోహితులు బొప్పన మోహన్,శ్రీనివాసులు, సహయకులు సురేష్,గ్రామస్తులు బొప్పన మోహన మురళీ,బొప్పన చెంగల్రాయులు,సునీల్ జి,అరుణ్ జి,దిలీప్,గుత్తి త్యాగరాజు, ఆడిపూడి సుదర్శన్ రెడ్డి, సామ్రాట్,తదితరులు పాల్గొన్నారు.
వరదయ్యపాలెం : పౌర్ణమి వేళ లోకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమామహేశ్వర వ్రతం
RELATED ARTICLES