TEJA NEWS TV : పుష్పలత కు వైసీపీ టికెట్ ఇస్తే అఖండ మెజారిటీతో గెలువు ఖాయం.
గుర్తించాల్సిన అధిష్టానం అంటున్న ఆమె అభిమానులు.
వరదయ్యపాలెం, తిరుపతి జిల్లా
సత్యవేడునియోజకవర్గానికి,ప్రజలకు,ముఖపరిచయస్తుడు,సంతవేలూరు పంచాయతీ,కువ్వాకులి గ్రామముకు చెందిన మడగళం శిఖామణి-కమలమ్ము కోడలు మడగళం పుష్పలత(50),సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్దిగా అవకాశం కల్పించాలని స్థానిక నియోజకవర్గం ప్రజలు కొందరు కోరుకుంటున్నారు.ఈమె భర్త ఆశీర్వాదం పోలీస్ శాఖలో చిత్తూరు నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ,ప్రజల మన్ననలు పొందారు.సత్యవేడు నియోజకవర్గంలోని నాగాలాపురం,పిచ్చాటూరు, వరదయ్యపాలెం,సత్యవేడు ప్రాంతాలలో సుమారు 12 సంవత్సరాలు ఎస్ ఐ గా పనిచేసి, ప్రజల మధ్య స్నేహాభావంతో మెలిగి,సేవలు అందించారు.పుష్పలత అదే సమయంలో అనేక సామాజిక సేవలు చేపట్టి,నిత్యం ప్రజలతో మమేకమయ్యేవారని పేరుంది.ఈమె బిఏ(పొలిటికల్ సైన్స్)పట్టా పొంది ఉండి,2019 లో కూడా సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారిలో మొదటి స్థానంలో ఉన్న విషయం ప్రజలకు తెలిసిందే!.వైసీపీ అధిష్టానం పుష్పలత ను గుర్తించి,సత్యవేడు ఎస్ సి రిజర్వుడ్ స్థానానికి టికెట్ ఇచ్చిన,గెలుపు పొందే అవకాశం మెండుగా ఉందని ఆమె అభిమానులు తెలిపారు.
వరదయ్యపాలెం: పుష్పలత కు వైసీపీ టికెట్ ఇస్తే అఖండ మెజారిటీతో గెలువు ఖాయం
RELATED ARTICLES