డ్వాక్రా రుణాల సొమ్ము దుర్వినియోగం కేసులో ఒకరు అరెస్టు.
10,63,342 రూపాయలు కోఆర్డినేటర్ పిగిలం పుల్లయ్య స్వాహ.
వరదయ్యపాలెం మార్చి 14
సత్యవేడు నియోజవర్గం వరదయ్యపాలెం మండలానికి సంబంధించి డ్వాక్రా రుణాల సొమ్ము దుర్వినియోగం కేసులో పోలీస్ అధికారులు వైయస్సార్ క్రాంతి పదం కోఆర్డినేటర్ పుల్లయ్యను(43) పోలీస్ అధికారులు అరెస్టు చేశారు.గురువారం సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఐ దివాకర్ రెడ్డి , వరదయ్యపాలెం ఎస్సై ప్రతాప్ ఆధ్వర్యంలో నిందితున్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా సీఐ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ వరదయ్యపాలెం మండలంలో వైయస్ఆర్ క్రాంతి పదం సంబంధించి శ్రీనిధి,సిఐఎఫ్,పిఓపి వంటి పథకాలలో రెండు కోట్ల 49 లక్ష రూపాయల వరకు దుర్నియోగం జరిగిందన్నారు.ఇందుకు సంబంధించిన కేసు 2022లో వరదయ్యపాలెం పోలీస్ స్టేషన్లో నమోదు అయింది అన్నారు. అప్పటి సీఐ శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనే పోలీస్ బృందం దీనిపై దర్యాప్తు ప్రారంభించనున్నారు.ఇందులో భాగంగానే ఈ కేసుకు సంబంధించి ఇదివరకే నిందితులు ఇంద్రజ,( వివోఏ) తులసమ్మ( స్వీపర్), విజయమ్మ( వివో)( సంఘమిత్ర) శారదమ్మ( గ్రామ సమైక్య లీడరు) తదితరులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారన్నారు.ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి వైయస్ఆర్ క్రాంతి పదం కోఆర్డినేటర్ పుల్లయ్యను గురువారం వరదయ్యపాలెం మండలం కడూరు క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు.కోఆర్డినేటర్ పుల్లయ్య దాదాపు 10 లక్షల 63 వేల రూపాయలు దుర్వినియోగం చేసినట్టు విచారణలో తేలింది అన్నారు. ఇంకా ఈ కేసులో వైయస్సార్ క్రాంతి పదం ఏపీఎం జ్యోతి, కోఆర్డినేటర్ జీవయ్య,సంఘమిత్ర దేవిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఈ సందర్భంగా సీఐ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు ఇంకా ఎవరైనా నిందితులుగా తేలితే వారిని కూడా చట్టం ముందు నిలబెడతామన్నారు.ఈ కేసు కు సంబంధించి సంబంధిత బ్యాంక్ అధికారుల పాత్రపై కూడా విచారణ కొనసాగిస్తామన్నారు.పోలీసులు అదుపులో తీసుకున్న నిందితుడు పుల్లయ్యను కోర్టులో హాజరు పరచడం జరుగుతుందన్నారు.
వరదయ్యపాలెం: డ్వాక్రా రుణాల సొమ్ము దుర్వినియోగం కేసులో ఒకరు అరెస్టు
RELATED ARTICLES