TEJA NEWS TV :
వరదయ్యపాలెం ప్రెస్ క్లబ్ కు అధికారికంగా ప్రభుత్వ గుర్తింపు
వరదయ్యపాలెం పాత్రికేయ చరిత్రలో ఓ సువర్ణఅధ్యాయం లిఖితమైంది.ఇటీవల నూతనంగా ఏర్పడిన వరదయ్యపాలెం ప్రెస్ క్లబ్ కు తొలిసారిగా అధికారికంగా ప్రభుత్వంచే గుర్తింపు లభించింది.ఏర్పాటునకు కృషి చేసిన ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకుడు గుత్తిత్యాగరాజుకు పలువురు పాత్రికేయులు అభినందనలు తెలిపారు.వరదయ్యపాలెం ప్రెస్ క్లబ్(రిజిస్ట్రేషన్ నెం 332/2023)కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడుగా సామర్ల హరి(సాక్షి),ప్రధానకార్యదర్శిగా గుత్తి త్యాగరాజు(సూర్య),కోశాధికారిగా సీనియర్ పాత్రికేయుడు ఉమా మహేష్,ఉపాధ్యక్షుడుగా కాతారి ప్రశాంత్(రాజ్ న్యూస్),సంయుక్త కార్యదర్శిగా అయ్యప్ప(ఐ న్యూస్), వ్యవస్థాపక కార్యవర్గ సభ్యులుగా సురేష్(హెచ్ఎం టీవీ), దొడ్డి శేఖర్ (10టీవీ)లు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇది రిజిస్ట్రేషన్ ప్రాతిపదిక ఏర్పాటైన కమిటీ అని, త్వరలోనే ప్రెస్ క్లబ్ కార్యవర్గ కమిటీని ప్రకటిస్తామని ప్రధానకార్యదర్శి గుత్తి త్యాగరాజు తెలిపారు.
ప్రజలు తమ సమస్యలను,మీడియా ద్వారా ప్రభుత్వం కు తెలియజేయడానికి వరదయ్యపాలెం ప్రెస్ క్లబ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
వరదయ్యపాలెం జర్నలిజం చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం
RELATED ARTICLES