వరదయ్యపాలెం 26 జులై 2024 ( తేజ న్యూస్ టీవీ )
వరదయ్యపాలెం హైస్కూల్ సెంటర్ నందు తల్లి,తండ్రి లేని చిన్నారి సోహిత్(5సం)కంటి వైద్యం కొఱకు ఇటీవల వరదయ్యపాలెం ప్రెస్ క్లబ్ ద్వారా సోషల్ మీడియాలో ఓ సమాచారం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వ కార్యాలయ అధికారులు స్పందించి చిన్నారి సోహిత్ కి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.వీటి ఆధారంగా ఈ నెల 13 వతేది చెన్నై లోని శంకర నేత్రలయ ద్వారా,చెన్నై రామాపురం లోని శ్రీరామచంద్ర మిషన్ ఆసుపత్రికి వైద్య సేవల కోసం సిఫరసుతో మొదటి దఫ చికిత్స పొంది వరదయ్యపాలెం చేరుకోవడం జరిగింది.రెండవ దఫ చికిత్స కోసం మరల చెన్నై వెళ్ళవలసి ఉంది.చిన్నారి సోహిత్ సంరక్షణ చూసే నాన్నమ్మ దుర్గ రోజు కూలి చేసుకుంటూ జీవనం సాగించేది.ఈ విషయాలు తెలుసుకున్న వరదయ్యపాలెం ప్రెస్ క్లబ్ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో వీరికి ఆర్ధిక సాయం అందించేందుకు స్వచ్ఛత్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థపకులు మావుడూరు మోహన్ తన సన్నిహితులకు విషయము తెలియజేయడమైనది.దీనిపై స్పందించిన సత్యవేడు మండలంకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ మాచర్ల రోశయ్య తన వంతు సహాయంగా ఐదు వేల రూపాయలను స్వచ్చత్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ మావడూరు మోహన్ కు అందజేయడం జరిగింది.శుక్రవారం మోహన్ మరియు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గుత్తి త్యాగరాజు ఐదువేల రూపాయలను చిన్నారి సోహిత్ సంరక్షణ చూసే దుర్గ కు అందజేయడమైనది.ఈ సందర్భంగా దుర్గ మాట్లాడుతూ తనకు ధ్రువీకరణ పత్రాలు అందజేయడానికి కృషి చేసిన నాయకులకు,అధికారులకు,వరదయ్యపాలెం స్వచ్ఛత్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ కి,వరదయ్యపాలెం ప్రెస్ క్లబ్ కు,తనకు ఇప్పటివరకు కొంత మేర సహకారం అందించిన టాక్సీ శ్రీను కు,పసుపులేటి విజయ్ కుమార్ కు ఆమె ధన్యవాదములు తెలిపారు.