TEJA NEWS TV:
కడురు సత్యవేడు మార్గంలో అడుగడునా గుంతలతో నిండి నరక ప్రాయంగ మారిన రహదారికి మరమ్మతులు చేపట్టిన ఎస్సై నాగార్జునరెడ్డి అడుగడుగునా గుంతలతో వర్షాలకు మురికికుపాలుగా మారి నిత్యం రాకపోకలకు ప్రజలకు నరకప్రాయంగా మారిన వరదయ్యపాలెం మండలం కడురు సత్యవేడు రహదారి మరమ్మతులకు, ఎస్సై నాగార్జున రెడ్డి స్పందించారు. ఎస్సై చొరవ తో ఎట్టకేలకు ఈ నరకపు రహదారికి మోక్షం కలిగింది.ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సూచనతో వరదయ్యపాలెం ఎంపీపీ భర్త దామోదర్ రెడ్డి సహకారంతో కడురు _, సత్యవేడు రహదారి పొడవునా ఏర్పడిన గుంతలని మెటల్ తో పూడ్చి వేసి మరమ్మతులు చేపట్టారు.ఈ మార్గంలో ప్రయాణించాలoటే నరకంగా మారిన రహదారికి తాత్కాలిక మరమ్మతులతో గుంతలను పూడ్చి కష్టాల నుంచి విముక్తి కల్పించిన ఎస్సై నాగార్జున రెడ్డి సేవా దృక్పథానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.