వరదయ్యపాలెం,26 నవంబరు 2024 తేజ న్యూస్ టీవీ
భారత ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినాన్ని ఘనంగా నిర్వహించాలన్న కలెక్టర్ సూచనల మేరకు ఎంపీడీఓ ప్రసాద్,ఇంచార్జి ఈఓపిఆర్డి చిరంజీవి,సీసీ అధికారులు తదితరులతో కలిసి ఘనంగా నిర్వహించారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.అనంతరం రాజ్యాంగ ప్రవేశిక చదివి అందరితో ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రసాద్ మాట్లాడుతూ,మన భారత రాజ్యాంగం ఎంతో గొప్ప ఆదర్శవంతమైన రాజ్యాంగమని పేర్కొన్నారు.భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావులు ప్రజలందరి మదిలో ఉన్నారని అన్నారు.పలుమార్లు మేథోమథనం అనంతరం రాజ్యాంగం రూపొందిందని అన్నారు.ప్రతి సంవత్సరం నవంబర్ 26న “సంవిధాన్ దివస్” దేశవ్యాప్తంగా జరుపుకుంటారని,నవంబరు 26రోజున 1949లో భారత రాజ్యాంగం అంగీకరించబడిన రోజును గుర్తు చేస్తుందని, ఆరోజు రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు మొదలు పెట్టారని,కానీ ఇది 1950 జనవరి 26 న పూర్తిగా అమలులోకి వచ్చిందని ఎంపీడీఓ ప్రసాద్ పేర్కొన్నారు.రాజ్యాంగ ప్రవేశికలోని ప్రతి పదం ఎంతో మహోన్నతమైన భావజాలాన్ని కలిగి ఉన్నదని, సార్వభౌమ, సామ్యవాద,లౌకిక,ప్రజాస్వామ్యం,న్యాయం,సమానత్వం సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుందని పేర్కొన్నారు.ప్రభుత్వ ఉద్యోగులుగా మనం ప్రజాసేవలో రాజ్యాంగ స్పూర్తిగా పనితీరు ఉండాలని పేద ప్రజల అభ్యున్నతికి వారి సంక్షేమానికి అభివృద్ధికి మనసా వాచా కర్మణా బాధ్యతగా అంకితభావంతో పనిచేయాలని పేర్కొన్నారు.రాజ్యాంగంలోని ప్రతి పదం ఒక ఉన్నతమైన ఆశయాన్ని సూచిస్తుందని తెలిపారు.రాజ్యాంగ ప్రవేశిక ఆమోదం పొందిన రోజున ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని,ప్రజాసేవలో భారత రాజ్యాంగ స్ఫూర్తి అమలుకు అన్ని స్థాయిల్లో అధికారులు పనిచేయాలని,మన దైనందిన జీవితంలో రాజ్యాంగ స్ఫూర్తితో జీవించాలని కోరారు. రాజ్యాంగ ప్రవేశిక దినాన్ని ఎంపీడీఓ కార్యాలయం నందు నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో అధికారులు,ఎంపీడీఓ సిబ్బంది, వెలుగుసిబ్బంది, పలువురు డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.
వరదయ్యపాలెం: ఎంపీడీఓలో రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినోత్సవం
RELATED ARTICLES