Wednesday, February 5, 2025

వరదయ్యపాలెం ఆర్ ఐ వేణుగోపాల్ పదవీ విరమణ సన్మాన సభ

ఉద్యోగికి విధులే జ్ఞాపకాలుగా మిగులుతాయి.

వరదయ్యపాలెం ఆర్ ఐ వేణుగోపాల్ పదవీ విరమణ సన్మాన సభలో వక్తలు

  వరదయ్యపాలెం, 31 ఆగస్టు  2024 ( తేజ న్యూస్ టీవీ )

ఉద్యోగిగా తన బాధ్యతలను నిర్వహించిన కాలంలోనే అవి తీయటి జ్ఞాపకాలుగా మారి వారికి ఎంతగానో గుర్తు చేస్తాయని వరదయ్యపాలెం తహశీల్దార్ రాజశేఖర్ అన్నారు.ఆ కాలంలో ఉద్యోగి తాను నిర్వహించిన విధులే పదేపదే తీయటి జ్ఞాపకాలుగా ఉంటాయన్నారు.శనివారం వరదయ్యపాలెం ఆర్ ఐ వేణుగోపాల్ పదవీ విరమణ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయనకుకు అభినందన సభను నిర్వహించారు.ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తహశీల్దార్ ఉదయభారతి మాట్లాడుతూ ఆర్ ఐ వేణుగోపాల్ ప్రతీ విషయాన్ని ఎంతో శ్రద్ధగా ఓపిగ్గా విని తన బాధ్యతలను సకాలంలో నిర్వహించేవారన్నారు.కార్యాలయంలో అందరితోటి కలిసిపోయి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారన్నారు.తనకు అప్పగించిన పనిని సకాలంలో పూర్తిచేసే వారన్నారు.ఆర్ ఐ వేణుగోపాల్ విధులు నిర్వహించిన బాధ్యత పట్ల ఆయన పనితనాన్ని గుర్తు  చేసుకుంటామని పూర్వ తహశీల్దార్ గౌరీశంకర్ రావు పేర్కొన్నారు.ఆయన శేష జీవితం ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో గడవాలని ఎంపీడీఓ ప్రసాద్ ఆకాంక్షించారు.విశ్రాంత తహశీల్దార్ యుగంధర్ మాట్లాడుతూ వేణు గోపాల్ తొలినాళ్ల నుంచి ఎంతో క్రమశిక్షణ కలిగి అందరితో కలిసి పోయే వారన్నారు.కొద్ది రోజులపాటు ఇబ్బందులు పడినా వాటిని మర్చిపోయి తిరిగి తమలో ఎంతో సంతోషాన్ని నింపినట్లు ఏఎస్ఓ ప్రసూనా చెప్పారు.స్థానిక సామాజిక కార్యకర్త సీసీఆర్ రాష్ట్ర ప్రతినిధి గుత్తి త్యాగరాజు మాట్లాడుతూ 16-2-1992 లో తొండమనాడు గ్రామ పరిపాలన అధికారి (విఏఓ)గా భాద్యతలు స్వీకరించి,పంచాయతీ కార్యదర్శి(పిఎస్ )గా,గ్రామ రెవిన్యూ అధికారి(విఆర్ఓ)గా,సీనియర్ అసిస్టెంట్ (ఎస్ఏ)గా,రెవిన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)గా, ఏర్పేడు,బండారు పల్లి, కేవీబీపురం, తొట్టంబేడు, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాలలో విధులు నిర్వహించి,మన్ననలు పొంది,ప్రశంసలు అందుకుని,వరదయ్యపాలెం మండలం నందు 31-8-2024 న పదవీవిరమణ చేస్తున్న పి వేణుగోపాల్ కి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆనందంగా జీవితం గడిపేల దైవానుగ్రహం ఉండాలన్నారు.ఈ సందర్భంగా సన్మాన గ్రహీత ఆర్ ఐ వేణుగోపాల్ మాట్లాడుతూ తనకు కార్యాలయంలో సహకరించిన సిబ్బంది మేలు మరువలేనన్నారు.తన ఇల్లు మాదిరిగానే కార్యాలయంలో తన బాధ్యతలను నిర్వహించేవాన్నని,తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆర్ ఐ వేణుగోపాల్ చెప్పారు.అనంతరం పదవీ విరమణ చేసిన ఆర్ ఐ వేణుగోపాల్ ను రెవిన్యూ సిబ్బంది, బంధువులు, శ్రేయోభిలాషులు,పూల మాలలు వేసి శాలువతో సత్కరించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత ఈఈ గంగుల శెట్టి,సీనియర్ అసిస్టెంట్ మురళీ, ఈఓపిఆర్డి చిరంజీవి, విఆర్వోలు రవిరెడ్డి, మధుసూదన్,చలపతి,హనీఫ్,నాగేంద్ర,సుగుణ,మాదవి,సుజిత, ఆదిలక్ష్మి, మోహన్,గతంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన చోట నుండి రెవిన్యూ ఉద్యోగులు, రెవిన్యూ సర్వేయర్లు,విఆర్ఏ ఉద్యోగులు,సీసీఆర్ రాష్ట్ర సభ్యులు శిరీష్ బాబు,స్థానిక నాయకులు హరిబాబు రెడ్డి,కే వెంకటయ్య (చిన్న),కరుణాకర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular