TEJA NEWS TV :
సీసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కాళాశాల లో వ్యాసరచన పోటీలు నిర్వహణ.
వరదయ్యపాలెం, జనవరి 04.తిరుపతి జిల్లా.
కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (సీసీఆర్) ఆధ్వర్యంలో అవినీతి రహిత భారతదేశం అను అంశం పై వ్యాసరచన పోటీలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలనందు గురువారం ప్రిన్సిపాల్ పద్మావతి నిర్వహించారు.ఈ వ్యాసరచన పోటీలలో 19 విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీసీఆర్ జె ఎస్ గుత్తి త్యాగరాజు విద్యార్థులతో మాట్లాడుతూ సాధారణ ప్రజలు సైతం నేడు సమాజం లో అవినీతి చేత ఎదుర్కొంటున్న సమస్యలు,పడుతున్న కష్టాలు, ప్రతి రోజు కూడా వార్త పత్రికలు, మీడియా లో వస్తున్న అవినీతి అధికారుల బాగోతాలు,ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు అధికారులు లంచం కోసం పేద ప్రజలను సైతం నానా రకాలుగా పెట్టె ఇబ్బందులు తొలగిపోవాలని ,అవినీతి లేని భారతదేశం చూడాలని ప్రతి ఒక్క విద్యార్థి కలలు కనాలని, భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం చెపినట్టు ఆ కలలు సాకారం చేసే దిశగా,లక్ష్యం వైపు ముందుకు సాగాలని,గ్రామ స్థాయినుండి,తరగతి గదుల మధ్య నుండే లక్ష్య సాధనకు సంకల్పం తీసుకోవాలి అని తెలిపారు.మనకెందుకు అనే ధోరణి వీడాలని,మన గ్రామాన్ని, మండలాన్ని,నియోజకవర్గంను,జిల్లా ను,రాష్ట్రము,దేశమును అవినీతి లేని భారత దేశంగా నిలిపెందుకు నేటి యువత కంకణబద్దులు కావాలని సూచించారు.సింగపూర్,జపాన్ లాంటి దేశాలను ఆదర్శంగా తీసుకుని,మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ప్రభుత్వాలు అవినీతి నిర్మూలన కోసం 14400 లాంటి టోల్ ఫ్రీ నెంబర్ లు,ఏసీబీ లాంటి సంస్థలు,వాటి ఫోన్ నెంబర్ లు, మెయిల్ ఐడి లు,వెబ్ సైట్ లాంటివి తెలియజేస్తున్నప్పటికి,ఎక్కువ శాతం ప్రజలు ఆ పని చేయలేక పోతున్నారు.అంటే ఈ సమాజన్ని అవినీతి పరులు ఎలా భయబ్రాంతులకు గురిచేస్తున్నారో గమనించాలి అన్నారు.అందువలన అవినీతిని తరిమి కొట్టెందుకు అడుగులు వేయాలని తెలిపారు.ప్రిన్సిపాల్ ని ఇటీవల వ్యాసరచన పోటీలకు అనుమతి కోరగా,అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపాల్ పద్మావతి కు,కళాశాల సిబ్బందికి ధన్యవాదములు తెలిపారు.వ్యాస రచన పోటీలలో పాల్గొన్న విద్యార్థులను గుత్తి త్యాగరాజు అభినందనలు తెలిపారు. మిగిలిన విద్యార్థులు కూడా “అవినీతి అంతం-మన పంతం”,లక్ష్యం వైపు అడుగులు వేసేందుకు సంసిద్ధం కావాలని అన్నారు.
వరదయ్యపాలెం: అవినీతి లేని భారత నిర్మాణం కోసం యువత కంకణబద్దులు కావాలి : సీసీఆర్ ప్రతినిధి గుత్తి త్యాగరాజు
RELATED ARTICLES