వరదయ్యపాలెంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో మండల ప్రధాన సమస్యలను డీఎల్ డీవో వెంకట శేషయ్యకు వినతి పత్రం అందించిన మాజీ సర్పంచ్, సచివాలయం మండల జేఏసీ కన్వీనర్ చిన్నా (కన్నలి వెంకటయ్య).బుధవారం వరదయ్యపాలెంఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిన్నా మండలంలోని పలు ప్రధాన సమస్యలను DLDO వెంకట శేషయ్యకు విన్నవించారు.మండలకేంద్రం వరదయ్యపాలెంలో డ్రైనేజీ సమస్య, గోవర్థనపురం మారేడు కాలువపై వంతెన, గోపాలరావుకాలనీలో అంతర్గత రోడ్లు, మౌలిక వసతులు, 133 కేవీ విద్యుత్ లైన్లు మార్పు,zp ఉన్నత పాఠశాలకు మైదానం వసతి, వర్షాలకు రాకపోకలు స్తబింవే ఆరుదూరు సీఎల్ఎన్ పల్లి , కడురు క్రాస్ వద్ద వంతెనల నిర్మాణం, రహదారులకు ఇరువైపుల ఆక్రమణల తొలగింపు, ట్రాఫిక్ సమస్య, చిన్నపాండురు అపోలో కంపెనీ భూబాధితులకు పరిహారం, ప్రభుత్వభూముల స్వాధీనం, స్మశానాలకి దారి వసతి, స్మసానాలకి స్థలం కేటాయింపు, వంటి పలు సమస్యల పై వినతి పత్రం అందించి పరిష్కారానికి చొరవ చర్యలు తీసుకోవాలని కోరారు.ఎంపిడిఓ సుబ్రమణ్యం, ఎంపీపీ భర్త దామోదర్ రెడ్డి జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు
వరదయ్యపాలెంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం
RELATED ARTICLES