వరదయ్యపాలెం 20 జూన్ 2024 ( తేజ న్యూస్ టీవీ )
తెలుగింటి ఆడబిడ్డగా ఎన్టీఆర్ కి తగిన తనయురాలుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తగిన అర్ధాంగిగా ప్రజాసేవకు అంకితం అయిన నారా భువనేశ్వరి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారని టీడీపి మాజీ అధ్యక్షుడు చలపతి నాయుడు, మండల టీడీపి ప్రధాన కార్యదర్శి దశరథన్ అన్నారు. కోనేటిఆదిమూలం ఆదేశాల మేరకు వరదయ్యపాలెం బస్టాండ్ వద్ద నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేకు కోసి సంబరాలు జరుపుకున్నారు.
కార్యక్రమంలో టిడిపి నాయకులు శ్రీనునాయుడు మునిభూషణమ్మ తెలుగు యువత నాయకులూ మహేష్ నూతలపాటి హరి, మల్లి నాయుడు, మునీంద్ర(మునెయ్య) కృష్ణ మునిరాజా, శరవణ బీజేపీ నాయకులు సిద్దులయ్య, జనసేన నాయకులూ తడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.