తేజ న్యూస్ టివి రిపోర్టర్
వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలోని కీర్తినగర్ శానిటేషన్ మరియు వాటర్ సప్లయ్ సమస్యలపై కీర్తి నగర్ లో పర్యటించి మున్సిపల్ వాటర్ మెన్ కు మున్సిపల్ శానిటరీ జవాన్ కు పలు సూచనలు చేసిన స్థానిక *కార్పొరేటర్ సుంకరి.మనీషా శివకుమార్*
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని వాటర్ సప్లయ్ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ముందస్తుగా తెలియజేయడం వల్ల సమస్య తొందరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని అన్నారు..అనంతరం కాలనీ లో ఏపుగా పెరిగిన తుమ్మ చెట్లు మరియు పిచ్చి చెట్లను జెసిబి సహాయంతో తొలగించే పనులను పరిశీలించారు.
