సంగెం మండల తేజ న్యూస్ టివి ప్రతినిధి
జనవరి 22 తేదీన అయోధ్యలో భవ్య రామ మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవానికి ముస్తాబయి అయోధ్య ట్రస్ట్ వారు పార్టీలకు అతీతంగా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి,మరియు వి ఐ పి లకు ఆహ్వానాలు పంపిస్తే రావడమేమో దేవుడెరుగు కానీ దానిని కాంగ్రెస్ పార్టీ,మరియు కాంగ్రెస్ నాయకులు తప్పుగా ప్రచారం చేస్తూ బిజెపి పార్టీని తప్పుపట్టి బదనాం చేయడం ఏందని బిజెపి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రాదారపు శివకుమార్ ఖండించారు. తదనంతరం మాట్లాడుతూ అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ప్రతి గ్రామం నుండి ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారనీ, అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు ప్రతి గ్రామం నుండి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని పండుగ వాతావరణం లో పంచుతున్నారని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బిజెపికి 2024 లోకు సభ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్నారనీ అనడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తూ గ్రహిస్తున్నారని అన్నారు. 22వ తేదీన కొన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం బాధాకరమని సెలవు ప్రకటించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మెప్పుకోసమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించడాన్ని తెలంగాణ సమాజం మరిచి పోధని, మైనార్టీ, ఓట్ల కోసమే ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వరంగల్ జిల్లా: శ్రీ రామ మందిరం ప్రారంభోత్సవం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలి – బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రాదారపు శివ కుమార్
RELATED ARTICLES