*వరంగల్ ఎంపీ టికెట్ నాకే ఇవ్వాలి..*
*ఢిల్లీలో ఏఐసీసీ ముఖ్యులను కలిసిన…. ఎంపీ ఆస్పరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ*
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో శనివారం రోజు వరంగల్ ఎంపీ ఆస్పరెంట్ డాక్టర్ రామకృష్ణ తనకు వరంగల్ ఎంపి టికెట్ కేటాయించాలని ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ రాజేష్ లిలోథియా ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్ చౌదరి డాక్టర్ శైలజానాథ్ మయప్పన్ ను మరియు ఏఐసీసీ నేషనల్ ఓబీసీ చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్ ను కలిసి కోరారు . అందరూ కూడా సానుకూలంగ స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,వేం నరేందర్ రెడ్డి , సీతక్క , కొండా సురేఖ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డీ ఎమ్మెల్యే నాగరాజు ఎమ్మెల్యే రేవూరీ ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే యశస్విని ఇందిరా మీద పూర్తి నమ్మకం వుంది అన్నారు . పార్టీ ని నమ్ముకున్న కార్యకర్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తున్నారు నాకు కూడా తప్పకుండా టికెట్ ఇచ్చి పార్టీ కి ఇంకా ఎక్కవ పని చేసే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్న అన్నారు . ఈ కార్యక్రమంలో వల్లాల జగన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు .
వరంగల్ ఎంపీ టికెట్ నాకే ఇవ్వాలి.. -ఎంపీ ఆస్పరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
RELATED ARTICLES