TEJA NEWS TV TELANGANA :
వనపర్తి జిల్లా ప్రతినిధి ఆగస్టు 12 (తేజ న్యూస్ టివి); తెలంగాణ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించిందని కాంగ్రెస్ వనపర్తి నియోజకవర్గం నాయకులు ఎంపీపీ మెగా రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకలతో గద్దెనెక్కిన పెద్దలు నిరుద్యోగ యువతను మరిచారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతో యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందనుకుంటే వారికి నిరాశ మిగిల్చారన్నారు. ఎన్నికల ముందు నోటిఫికేషన్లు విడుదల చేసి ఆశపడే విధంగా ప్రలోభాలకు గురి చేస్తూ ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో యువత అసమాన పోరాటాన్ని ప్రదర్శించిందన్ని..తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. అధికారిక సంస్థాగత రాజకీయాలలో యువత ప్రాతినిధ్యం వహించాలని.. సమాజ అభివృద్ధి కోసం యువత ముందుకు రావాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందన్ని నమ్మించి నయవంచన చేసిన బిఆర్ఎస్ నాయకులకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. యువత బలిదానాలను చూడలేక ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందనీ..విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణ ఉద్యమంలో కీలక ఘటనలయ్యాయి ఆయన గుర్తు చేశారు. అనంతరం అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా వనపర్తి నియోజకవర్గం యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు.