సంగెం మండల తేజ న్యూస్ టివి ప్రతినిధి.
మేడారంలోని శ్రీ సమ్మక్క
సారక్క వనదేవతలను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు.
పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు ఆదివారం మేడారంలోని శ్రీ సమ్మక్క సారక్క వనదేవతలను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ‘గిరిజన ఆరాధ్య దేవతలు సమ్మక్క, సారలమ్మ ఆశీస్సులు తెలంగాణకు ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.
అమ్మవార్ల దీవెనలతో ప్రజల ఆశీస్సుల వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని ఎల్లవేళలా అమ్మవార్ల ఆశీస్సులు తెలంగాణ ప్రజలకు ఉంటుందని అలాగే పరకాల నియోజకవర్గ ప్రజల కృషి అమ్మవార్ల కటాక్షం వల్ల తాను శాసనసభ్యునిగా కొనసాగుతున్నానని పరకాల నియోజకవర్గ ప్రజలు పాడిపంటలతో సుఖసంతోషాలతో ఆనందంగా జీవించేలా సమ్మక్క సారక్కల దీవెనలు ఉండాలని అమ్మవార్లను కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.
వనదేవతలను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి
RELATED ARTICLES