ఎన్టీఆర్ జిల్లా సాధారణ బదిలీల్లో భాగంగా వత్సవాయి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై గా పిక్కి ఉమామహేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు మహిళా సమస్యలు పై ప్రత్యేక దృష్టి సారిస్తాం అని తెలిపారు. అంతే కాకుండా మండలంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేరుగా తమను కలవచ్చునని ఆయన తెలిపారు ఎటువంటి అసాంఘిక సంఘటనలు, కార్యకలాపాలు జరిగిన, వాటిని ప్రోత్సహించినవారు ఎవరైనా ఉపేక్షించేది లేదని అన్నారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ప్రశాంతమైన జీవితం సాగించాలని ఘర్షణలకు, దొంగతనాలకు, తదితర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు.
వత్సవాయి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పిక్కి ఉమా మహేశ్వరరావు
RELATED ARTICLES