భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భారీ లంచం ఘటన వెలుగుచూసింది. కేవలం రెండు నెలల క్రితమే ఉద్యోగంలో చేరిన గ్రామ పరిపాలనాధికారి బానోత్ శ్రీనివాస్ నాయక్ రూ.60 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు.
వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేయించేందుకు వచ్చిన ఒక రైతు వద్ద నుండి రూ.60 వేలు లంచం కోరినట్టు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఉచ్చుపన్ని, అధికారిని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గ్రామ పరిపాలనాధికారి
RELATED ARTICLES



