కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. కోటపల్లి ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఎసన్వాయి గ్రామానికి చెందిన మారుపాక బానయ్య(52) అనే వ్యక్తి చెన్నూరులోని మదనం పోచమ్మ దేవాలయంలో మొక్కులు చెల్లించి, మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై తన గ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో అదుపు తప్పి కింద పడగా, తలకు బలమైన దెబ్బ తగిలి అక్కడిక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడపడమే కాక, హెల్మెట్ కూడా ధరించకుండా నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు పోగొట్టుకున్నాడని, అతను చేసిన తప్పిదమే వేరొకరు చేయరాదని, నిర్లక్ష్యంగా వాహనం నడిపి మీ బంగారు జీవితాలను పణంగా పెట్టవద్దని ఎస్సై సురేష్ సూచించారు.