TEJA NEWS TV
చేగుంట మండల కేంద్రానికి చెందిన తిరుపతి మౌనిక రైలు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయిత పరంజ్యోతి అంత్యక్రియ నిమిత్తం 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. రెండు రోజుల క్రితం రైలు ప్రమాదంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందిన తిరుపతి మౌనిక అంత్యక్రియల కోసం 5000 రూపాయలు పరంజ్యోతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు చింతల సిద్ధిరాములు, లక్ష్మణ్,వెంకటి, నర్సింలు, రవి, అంతు కిష్టయ్య కాలనీవాసులు,బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు.
రైలు ప్రమాదంలో మరణించిన మౌనిక కుటుంబానికి ఆర్థిక సాయం
RELATED ARTICLES