Tuesday, December 9, 2025

రైతులను దివాలా తీయించే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల,కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి…ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం.

ప్రెస్ నోట్.                 రుద్రవరం

నంద్యాల జిల్లా రుద్రవరంమండలంలోని  చిన్న కంబలూరు మెట్ట వద్ద గల ఫంక్షన్ హాల్ లో  సంఘం జిల్లా కార్యదర్శి టి .రామచంద్ర అధ్యక్షతన జరిగినది. సభ ప్రారంభంలో హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, జాతీయ రైతు కమిషన్ కార్యదర్శి అయినా ప్రొఫెసర్ స్వామినాథన్ గారి శత జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రమేష్ కుమార్ గారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి  కూటమి ప్రభుత్వంఅనుసరిస్తున్న విధానాలు వ్యవసాయ రంగం ని సంక్షోభంలోకి నెట్టే విధంగా, రైతులందరూ దివాలా తీసే విధంగా ఉన్నాయన్నారు. అనునిత్య ఆ దాని, అంబానీ లాంటి కార్పోరేట్ కంపెనీల లాభాలు పెంచే విధంగా, రైతుల కడుపులో కొట్టే విధంగా ఉన్నాయన్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో కోత,ఎరువుల సబ్సిడీ లు తగ్గించడం వల్ల. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు, ప్రకటించిన మద్దతు ధరలు అమలు జరగడం లేదు. ఫలితంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులందరూ సంఘటితంగా ఉద్యమిస్తేనే రైతాంగ వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టగలరు అన్న అన్నారు. అనంతరం రైతు సంఘం జిల్లా సహా కార్యదర్శి రామచంద్రుడు మాట్లాడుతూ  మండలంలో 43వేల ఎకరాల్లో వ్యవసాయ పంటలు పండుతున్న మండల కేంద్రంలో కనీసం ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం, అన్నిపంట పొలాల కెళ్ళి దారులు సక్రమంగా లేక, పొలాలకు మందులు ఎత్తుకుపోవడం, పండిన పంటను ఇంటికి తెచ్చుకోవడం కూడా ఇబ్బందిగా ఉన్నదని, అటవీ సమీప గ్రామాల్లో అడవి పందుల బెడదలతో మొక్కజొన్న, వరి,  మినుము లాంటి పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నవనీ, ఫారెస్ట్ అధికారులు రక్షణ వలయాలు ఏర్పాటు చేయాలని, సిరి వల్ల చిన్న కమ్మలూరు మెట్ట మధ్యలో ఆర్ అండ్ బి దారి తీవ్రంగా దెబ్బతిని లోతైన గుంతలు ఏర్పడడం వల్ల నిత్యం ప్రమాదాలతో ప్రజానీకం ఇబ్బంది పడుతున్న పట్టించుకునే పాలకులు కరువయ్యారన్నారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో అనేక రకాల లోపాలు జరగటం వల్ల ఎల్ పి నెంబర్లు, ఆన్లైన్లో ఎక్కువ తక్కువగా నమోదు, ఒకరి భూములు మరొకరికి ఆన్లైన్ నమోదు వంటి కారణాలతో నిత్యం రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి రైతులకు ఏర్పడిందన్నారు. అన్ని రకాల పంటలకు బీమా ప్రీమియం చెల్లింపులు ప్రభుత్వమే చేయాలన్నారు. రైతాంగం యొక్క అన్ని రకాల సమస్యలను  పరిష్కారం చేసుకోవడం కోసం రైతులు  రాజకీయాలకతీతంగాసంఘాలు నిర్మించుకోవాలని  అన్నారు. అందుకు మండల స్థాయిలో నేడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండలకమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఎంపికైన సభ్యులందరూ రైతుల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం 21 మందితో మండల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు  గు రెడ్డి, కేశాలు, హరి నారాయణ, హుస్సేన్ భాష, నాగేశ్వరరావు, డి మల్లేష్, నాగేష్, కమ్మన్న, నరేష్, రామకృష్ణ హనుమంతు తో పాటు,మండలంలోని వివిధ గ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular