TEJA NEWS TV ALLAGADDA
కేంద్ర బొగ్గుగనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషి రేపు (శుక్రవారం) అహోబిలంకు రానున్నారు. ఉదయం ఓర్వకల్ మండలంలోని పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును మంత్రి జోషి సందర్శించిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు అహోబిలం క్షేత్రానికి చేరుకొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. మంత్రి రాక సందర్భంగా అహోబిలం జడ్పీ పాఠశాల ఆవరణలో హెలిప్యాడ్ , భద్రత ఏర్పాట్లను ఆళ్లగడ్డ రూరల్ సీ. ఐ. దాది మురళీధర్ రెడ్డి, అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు.
రేపు అహోబిలం రానున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
RELATED ARTICLES