బుచ్చిరెడ్డిపాళెం నందుగల రెయిన్బో పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు అట్టహసంగా జరిగాయి.ప్రీ ప్రైమరీ నుండి ప్రైమరీ వెళుతున్న సందర్భంలో విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు.ఈ సందర్బంగా ముఖ్యఅతిధులుగా పాఠశాల కరెస్పాండంట్ టి.చిట్టి బాబు, డాక్టర్ కె. సాయిరాం, అడ్వకేట్ బి ఝాన్సీ మరియు అతిధులుగా మోజస్ (రిటైర్డ్ ఎంప్లాయ్ మునిసిపల్ కార్పొరేషన్ నెల్లూరు), పాల్ కిషోర్ (జిల్లా కోర్ట్ సూపరింటెండెంట్) హాజరయ్యారు. ఈ సందర్బంగా డాక్టర్ సాయిరాం మాట్లాడుతూ పిల్లలందరూ జంక్ ఫుడ్ వైపు ఎక్కువగా మక్కువ చూపుతూ వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అని అన్నారు. చిన్నప్పటి నుండే గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు అని పిల్లలకు ఆరోగ్యానియమాలను వివరించారు.అడ్వకేట్ ఝాన్సీ మాట్లాడుతూ ఈ రోజుల్లో పిల్లలకు పెద్దల పట్ల గౌరవం లేదని అన్నారు. ఇందుకు కారణం పిల్లలు ఎడతెరప లేకుండా ఫోన్లు చూడడం వలన అని హెచ్చరించారు.తల్లిదండ్రులు పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాలని అన్నారు.మునిసిపల్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయ్ మోజెస్ మాట్లాడుతూ తన చిన్నతనంలో ఉపాధ్యాయులపట్ల ఎంత గౌరవంగా ఉండేవారు గుర్తుకుతెచ్చుకొని పాఠశాలకు తల్లిదండ్రులు సహకరించక పోతే విద్యార్థులలో మార్పు తేవడం చాలా కష్టం అని అన్నారు. ఈ సందర్బంగా పాల్ కిషోర్ మాట్లాడుతూ పిల్లల్లో రాబోయే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, దేశానికి అవసరమైన నాయకులు వున్నారని వారిని వెలికి తీసే బాధ్యత ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులదే అని వారి బాధ్యతను గుర్తుచేసారు. అదేవిదంగా పాఠశాల కరెస్పాండెంట్ చిట్టి బాబు మాట్లాడుతూ భవిష్యత్తులో పిల్లలు ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నస్థాయికి ఎదగాలని వారిని ఆశీర్వదించారు. ఇదేవిధంగా పదోవతరగతికి వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ నుండి పిల్లలు వారి భవిష్యత్తుకు మంచి బాట వేసుకోవాలి అన్నారు. వారు వేసే ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి అన్నారు.ఈ కార్యక్రమంలో కుమార్ రెడ్డి,విద్యార్థులు వారి తల్లిదండ్రులు బోధనేతర సిబ్బంది పాల్గొని విజయవంతం చేసారు.
రెయిన్బో పాఠశాల నందు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే మరియు పదోవతరగతి విద్యార్థులకు వీడ్కోలు సభ
RELATED ARTICLES