




బుచ్చిరెడ్డిపాళెం 11 ఫిబ్రవరి 2025 తేజ న్యూస్ టీవీ
నెల్లూరుజిల్లా ముత్తుకూరు లోని ఏ పి జెంకో లో నేషనల్ యూత్ ఇండోర్ ఫీల్డ్ ఆర్చరీ అసోసియేషన్ వారిచే నిర్వహించబడిన అల్ ఇండియా ఇన్విటేషనల్ యూత్ ఇండోర్ ఫీల్డ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ 2025 నందు బుచ్చిరెడ్డి పాలెం నందు గల రెయిన్బో పాఠశాలలో మొదటి తరగతి చదువుతున్న నిశాంత్ రెడ్డి ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. అంతేకాక ఛాంపియన్ షిప్ కప్ ను సొంతం చేసుకున్నారు. ఈ సందర్బంగా కరెస్పాండంట్ చిట్టిబాబు మాట్లాడుతూ గతంలో కూడా లక్నో నందు జరిగిన జాతీయ స్థాయి పోటీలలో రెండొవస్థానం లో నిలవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని కొనియాడారు. ప్రిన్సిపాల్ ఎలియాజర్ పల్లిపట్టు నిశాంత్ రెడ్డిని పుష్ప గుచ్ఛం ఇచ్చి అభినందించారు.